World Richest Village: పేరుకే గ్రామం.. నగరాలకంటే అభివృద్ధి.. ఒకొక్కరి ఆదాయం నెలకు రూ.80లక్షలు పైనే..

World Richest Village: పేరుకే గ్రామం.. నగరాలకంటే అభివృద్ధి.. ఒకొక్కరి ఆదాయం నెలకు రూ.80లక్షలు పైనే..

ఈ గ్రామంలో నివసించే ప్రతి వ్యక్తి వార్షికాదాయం 80 లక్షల రూపాయల కంటే ఎక్కువ. అయితే ఈ గ్రామ ప్రజలు ఏదైనా ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారేమో.. అందుకే ఈ గ్రామం అంత ఆర్థికాభివృద్ధి సంధించింది అనుకుంటున్నారా.. అయితే అది పొరపాటు..

World Richest Village: ఊరు పేరు వినగానే గుడిసెలు, మట్టి ఇళ్లు, పగిలిన రోడ్లు గుర్తుకు వస్తాయి కానీ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలన్నింటిని వెనక్కి నెట్టినంతగా అభివృద్ధి చెందిన గ్రామం ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా. ఇది మాత్రమే కాదు..  ఈ గ్రామంలోని (వరల్డ్ రిచెస్ట్ విలేజ్) ప్రజలు నగరాల కంటే చాలా అభివృద్ధి చెందారు. నెలకు లక్షల రూపాయల జీతం పొందుతారు. విలాసవంతమైన బంగళా, ఖరీదైన కారు, మంచి చదువులు, అన్నిరకాల సౌకర్యాలతో నివసించాలని కలలు కనే వారికీ.. ఈ గ్రామస్థులను చూస్తే.. అసూయ కలగడం కాయం. ఎందుకంటే ఈ గ్రామ ప్రజలకు ఈ సౌకర్యాలు కలకాదు. ఈ గ్రామ ప్రజల జీవితం వాస్తవికత అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి రిచెస్ట్ జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఆగ్రామం ఎక్కడ ఉందో తెలుసా..

చైనాలోని జియాంగ్యిన్ నగరానికి సమీపంలో ఉన్న హువాజీ గ్రామం ప్రపంచంలోనే రిచెస్ట్ విలేజ్ గా ప్రసిద్ధిగాంచింది.  ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరి జీవనశైలిని నగరంలోని పెద్ద పెద్ద ధనవంతులకు మించి ఉంటుంది. ఈ గ్రామంలో నివసించే ప్రతి వ్యక్తి వార్షికాదాయం 80 లక్షల రూపాయల కంటే ఎక్కువ. అయితే ఈ గ్రామ ప్రజలు ఏదైనా ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారేమో.. అందుకే ఈ గ్రామం అంత ఆర్థికాభివృద్ధి సంధించింది అనుకుంటున్నారా.. అయితే అది పొరపాటు.. ఎందుకంటే ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికీ పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.  అయినప్పటికీ ఈ గ్రామంలో నివసించే ప్రజలు నగర ప్రజలు కలలు కనే ప్రతి సౌకర్యాన్ని సొంతం చేసుకున్నారు.

 గ్రామ ప్రజల వార్షిక ఆదాయం:  ఈ గ్రామంలో నివసిస్తున్న మొత్తం 2000 మంది నమోదిత వ్యక్తుల వార్షిక ఆదాయం లక్ష యూరోలు..  అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 80 లక్షల రూపాయలు. అయితే  గతంలో ఈ గ్రామం నేడు అందరూ చూస్తున్నట్లుగా లేదు. 1961లో ఈ గ్రామం పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ కమిటీ మాజీ ఛైర్మన్ వు రెన్ వివో ఈ గ్రామ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చారు.

వు రెన్ వివో తమ గ్రామాన్ని పారిశ్రామికంగానే కాదు.. వ్యవసాయ పరంగా కూడా మెరుగుపరిచారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ కష్టపడేలా ఖచ్చితమైన నియమాలను రూపొందించారు. అతని నియమాలతో పాటు.. గ్రామస్థుల కృషి ఫలితంగా  గ్రామ చిత్రం పూర్తిగా మారింది. ఈ గ్రామం  స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ లో చేర్చారు. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. గ్రామస్తుల పేర్లను వాటాదారులలో చేర్చారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు లక్షాధికారులుగా మారారు. ఈ ఊరిలో ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లు, హోటళ్లు, అందమైన పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ సహా ఇతర సౌకర్యాలను చూస్తుంటే, ప్రపంచంలోని హైటెక్ నగరాలు కూడా ఈ గ్రామం ముందు దిగదుడుపే అనిపిస్తుంది ఎవరికైనా..