World Hepatitis Day : హెపటైటిస్ దినోత్సవం .. లివర్ జాగ్రత్తలు .. కొన్ని నిజాలు

మన శరీరంపై వచ్చే కురుపులు, గాయాల్ని మనం ఇట్టే గుర్తుపట్టగలం. శరీరం లోపల ఏమవుతుందో మనకు తెలియదు. కనీసం 6 నెలలకు ఓసారైనా డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకునే ఆర్థిక పరిస్థితులు మన దేశంలో తక్కువే. కాబట్టి కంటికి కనిపించని లోపలి శరీర భాగాల్ని కాపాడుకోవడానికి మనం చెయ్యాల్సింది కొంత ఉంది. ముఖ్యంగా లివర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ కాలేయం మన శరీరంలో ఒకేసారి 700 రకాల పనులు చక్కబెడుతుంది. పైగా చాలా సందర్భాల్లో ఇది తనను తాను రిపేర్ చేసుకుంటుంది. వీలైనంతవరకూ పాడవకుండా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మనం దాన్ని అర్థం చేసుకోకపోతే... నష్టం కలిగిస్తే... దెబ్బతింటుంది. అలాంటి సమయంలో వచ్చే అనేక వ్యాధుల్లో ఒకటి హెపటైటిస్. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది వస్తున్నట్లూ, వచ్చినట్లూ ముందుగా తెలియదు. సైలెంటుగా వచ్చి.. వయలెంటుగా తయారవుతుంది. అందుకే ఈ వ్యాధి గురించి అందరికీ తెలియాలనే ప్రతీ సంవత్సరం జులై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుతున్నారు. లివర్‌లో కొవ్వు పెరిగితే హెపటైటిస్ వ్యాధి వస్తుంది. దీన్నే హెపాటిక్ స్టీటోసిస్ (hepatic steatosis) అని కూడా అంటారు. ఐదు రకాల వైరస్‌ల వల్ల ఇది వస్తుంది. మామూలుగానే కాలేయంలో కొంత కొవ్వు ఉంటుంది. దానికి అదనపు కొవ్వు చేరితే ఈ వ్యాధి మొదలవుతుంది.

ప్రపంచ హెపటైటిస్ డే చరిత్ర (History of World Hepatitis Day)
2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఈ వ్యాధిని అధికారికంగా గుర్తిస్తూ... దీనికి జులై 28న ఓ దినోత్సవంగా జరుపుతోంది. ఇలా నాలుగు వ్యాధులకు మాత్రమే దినోత్సవాలు ఉన్నాయి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. ఇది రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాయి. వరల్డ్ హెపటైటిస్ అలియాన్స్ (WHA) అనే ఓ గ్రూపు ఉంది. ఇందులో 81 దేశాల నుంచి 230 సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఇవన్నీ హెపటైటిస్ పై పోరాడుతున్నాయి.

హెపటైటిస్ ఎందుకు, ఎలా వస్తుంది? (How Hepatitis effects liver)
మీరు నెలకు ఒకసారైనా కాకరకాయ కర్రీ తింటారా? తినకపోతే.. కచ్చితంగా తింటూ ఉండండి. బాబోయ్ చేదు అనవద్దు. ఆ చేదే శరీరం లోపల ఉన్న చెడు క్రిములను చంపుతుంది. అదే విధంగా శరీరంలో, కాలేయంలో ఉన్న కొవ్వును కూడా కరిగించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది "మద్యం తాగితే వేడి చేస్తుంది కదా... కాబట్టి కొవ్వు కరిగిపోతుందిలే" అని అనుకుంటారు. అది కొంతవరకే నిజం. ఆ మద్యాన్ని అదేపనిగా తాగేవారి శరీరంలో పిండి పదార్థం ఎక్కువవుతుంది. అది క్రమంగా గ్లూకోజ్ గా మారుతుంది. మనుషులు బరువు పెరగడం మొదలవుతుంది. దాంతో శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బాడీ కొవ్వుల్ని కరిగించే శక్తిని కోల్పోతుంది. అంతే.. కొవ్వు నిల్వలు పెరుగుతాయి. బరువు ఇంకా పెరుగుతారు. అదే సమయంలో హెపటైటిస్ వంటివి దాడిచేస్తాయి. సో... జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిది.

శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరగడానికి కారణం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫ్రైలు, చిప్స్ వంటివి ఎక్కువగా తినడం కారణం అవుతోంది. కాబట్టి వీటిని తినేవారు.. బాడీలో హీట్ పెరిగేలా... మిరియాలు, ఆవాలు, వెల్లుల్లి వంటివి కూడా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఇవి బాడీలో వేడిని పెంచి కొవ్వును కరిగిస్తాయి. వర్కవుట్లు, ఎక్సర్‌సైజ్‌లు కూడా మేలు చేస్తాయని మీకు తెలుసు. హెపటైటిస్ వస్తే... లివర్ పాడవుతున్న విషయం మనకు తెలియదు. పూర్తిగా పాడైన తర్వాతే తెలుస్తుంది. అప్పుడు లివర్ ని రిపేర్ చేయడం కష్టం. కాలేయ మార్పిడి తప్పనిసరి అవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. ఇదంతా మనకెందుకు.. జాగ్రత్తలు పడితే అంతా మంచే జరుగుతుంది.

అధిక బరువు ఉన్నవాళ్లు, డయాబెటిక్ పేషెంట్లు, హైబీపీ, గుండె సమస్యలు, కొవ్వు సమస్యలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి హెపటైటిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది భయంకరమైనది కాబట్టే... దీన్ని లివర్ క్యాన్సర్ అని కూడా అంటున్నారు.

హెపటైటిస్ రాకుండా ఏం చెయ్యాలి (How to prevent Hepatitis)
హెపటైటిస్ రాకుండా ఉండాలంటే ఇళ్లలోనే వండుకొని తినాలి. రైస్ బ్రాన్ ఆయిల్ వంటి మంచి నూనె వాడాలి. ఫ్రైలు తగ్గించుకొని... ఉడికించుకునే వంటలు ఎక్కువగా వండుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి. వాటిలో కొవ్వు పెద్దగా ఉండదు, రోజూ అన్నంతోపాటూ గింజలు, పప్పులు, ధాన్యాలు కూడా తినాలి. పండ్లలో సహజమైన కొవ్వును కరిగించే పోషకాలు ఉంటాయి. కాబట్టి సీజన్ వారీగా వచ్చే పండ్లను తినాలి. స్వీట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీములూ, బిస్కెట్లు, కేకులు, బేకరీ ఐటెమ్స్ తగ్గించుకోవాలి. గ్రీన్ టీ, రోజుకో కప్పు కాఫీ వంటివి తాగొచ్చు. వాల్‌నట్స్ మీకు తెలుసుగా. మెదడు ఆకారంలో ఉంటాయి. అవి చేదుగా, చప్పగా ఉన్నా... కొవ్వును బాగా కరిగిస్తాయి. వీలైతే వాటిని తినాలి. ఇక చివరిగా మద్యం తాగకూడదని మనకు తెలిసిందేగా.