Thank You Movie: ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా? హిట్ కొట్టాలంటే అంత రాబట్టాల్సిందే!

Thank You Movie: ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా? హిట్ కొట్టాలంటే అంత రాబట్టాల్సిందే!

Thank You Movie Pre Release Business: థాంక్యూ సినిమా ఏఏ ప్రాంతంలో ఎంత బిజినెస్ చేసిందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Thank You Movie Pre Release Business: లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలతో హిట్లు కొట్టిన నాగచైతన్య ఇప్పుడు థాంక్యూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా 22వ తేదీన ఘనంగా విడుదలైంది. అయితే విడుదలకు ముందు నుంచి సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేందుకు దిల్ రాజు అనేక ప్రయత్నాలు చేశారు.

కానీ ఎందుకో కానీ ఈ సినిమా మీద అంత బజ్ అయితే ఏర్పడలేదు. అయితే నాగచైతన్య గత సినిమాల దృష్ట్యా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ సినిమా ఏఏ ప్రాంతంలో ఎంత బిజినెస్ చేసిందనే  విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్యూ  సినిమా నైజాం ప్రాంతంలో ఎనిమిది కోట్ల రూపాయల మేర హక్కులు అమ్ముడుపోయాయి. థాంక్యూ  సినిమాకు సీడెడ్ ప్రాంతంలో రెండున్నర కోట్ల రూపాయల మేర హక్కులు అమ్ముడుపోయాయి.అలాగే ఈ సినిమాకు మిగిలిన ఆంధ్ర ప్రాంతమంతా కలిపి 9.50 కోట్ల రూపాయల మేర హక్కుల అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ కలిపి 20 కోట్ల రూపాయల మేర ఈ సినిమా హక్కుల అమ్ముడు అయ్యాయి. అలాగే థాంక్యూ సినిమాకు కర్ణాటక సహా మిగతా భారతదేశం వ్యాప్తంగా కోటిన్నర రూపాయలు మేర హక్కులు అమ్ముడయ్యాయి. అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమాను రెండున్నర కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు అక్కడ డిస్ట్రిబ్యూటర్లు. ఈ నేపథ్యంలోనే సినిమా మొత్తం 24 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా బ్రేక్ ఈవెన్ 25 కోట్లుగా నిర్ణయించారు.
 Read Also: