తెలుగు యోధాస్‌ శుభారంభం

పుణె: అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో తెలుగు యోధాస్‌ శుభారంభం చేసింది. ఆదివారం స్థానిక శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్‌ గన్స్‌పై విజయం సాధించింది. 48-38 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్‌ ముగిసే సరికి 29-15తో ఆధిక్యంలో నిలిచిన తెలుగు యోధాస్‌.. చివరి వరకూ అదే జోరు కొనసాగించి గెలుపు అందుకుంది. జట్టులో అటాకింగ్‌లో అరుణ్‌ 10 పాయింట్లతో రాణించాడు. డిఫెండర్‌ దీపక్‌ మాధవ్‌ రెండు నిమిషాల పాటు ప్రత్యర్థికి దొరకకుండా తప్పించుకున్నాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 69-44తో ముంబయి ఖిలాడీస్‌ను ఓడించింది. లీగ్‌ ఆరంభ కార్యక్రమంలో భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్‌, కార్యదర్శి త్యాగి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌, అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ కమిషనర్‌, సీఈవో తెంజింగ్‌ నియోగి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.