Hello World Review: హలో వరల్డ్‌ రివ్యూ

సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతున్న రోజులివి. అందుకే ఓటీటీల్లో నటించేందుకు సినీ తారల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. అలా ఆర్యన్‌ రాజేశ్‌ (Aryan Rajesh), సదా (Sadha) నటించిన  వెబ్‌ సిరీస్‌ ‘హలో వరల్డ్‌’ (Hello World). నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ ‘జీ 5’ (Zee 5) వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమ్‌ అవుతోంది. మరి, ‘హలో వరల్డ్‌’ కథేంటి? ఎలా ఉంది? ఓసారి చూద్దాం. (Review)అంతా సాఫీగా సాగితే కథ మజా అనిపించదు. అది సినిమా అయినా సిరీస్‌ అయినా. నాయకాప్రతినాయకా మధ్య వైరం నడిచే సన్నివేశాలుంటేనే ఆసక్తి కలుగుతుంది. దాన్ని దృష్టిలోనే పెట్టుకునే ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కథలో సాఫ్ట్‌గా కనిపించే విలన్‌ పాత్రను తీసుకొచ్చి.. చివరి ఎపిసోడ్లలో రక్తికట్టించే ప్రయత్నం చేశారు. సంస్థలో చేరిన కొత్త ఉద్యోగులకు ఆఫీసర్‌ సహాయం చేయాలనుకోవటం, ఆ ఆఫీసర్‌పై మేనేజరు పగతో రగిలిపోవటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అసలు, ఆ ఇద్దరి మధ్య వైరం ఎందుకొచ్చిందో వివరించే క్లైమాక్స్‌ సీన్‌ థ్రిల్‌ పంచుతుంది.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.