ఆర్యన్‌ రాజేశ్‌-సదా ‘హలో వరల్డ్‌’లో ట్రైలర్‌ చూశారా?

సదా(Sadha), ఆర్యన్‌ రాజేశ్‌ (Aryan Rajesh) ప్రధాన పాత్రలుగా సిద్ధమైన వెబ్‌సిరీస్‌ ‘హలో వరల్డ్‌’ (Hello World).

హైదరాబాద్‌: సదా(Sadha), ఆర్యన్‌ రాజేశ్‌ (Aryan Rajesh) ప్రధాన పాత్రలుగా సిద్ధమైన వెబ్‌సిరీస్‌ ‘హలో వరల్డ్‌’ (Hello World). ఫన్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ ఆగస్టు 12 నుంచి జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన యువతీ యువకుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ వంటి అనుబంధాలతో నేటితరం యువతను ఆకట్టుకునేలా దీన్ని సిద్ధం చేశారు. పింక్‌ ఎలిఫెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నటి నిహారిక దీన్ని నిర్మించారు.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.