అక్షయ్‌కి జోడీగా..

పోరాటాల కథానాయకుడు అక్షయ్‌కుమార్, ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా జోడీగా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పరిణీతి కొత్త ప్రాజెక్టు వివరాలు తెలియజేసింది. అక్షయ్‌తో కలిసి ఉన్న ఫొటోని పంచుకుంటూ.. ‘మా ‘కేసరీ’ జంట మళ్లీ ఒక్కచోటికి చేరింది. ఇంగ్లండ్‌లోని యార్క్‌లో షూటింగ్‌లో ఉన్నాం. నవ్వులు, జోక్‌లు, పంజాబీ ముచ్చట్లు.. మళ్లీ ఊపందుకోనున్నాయి’ అంటూ కామెంట్‌ జోడించింది. ఐదురోజుల కిందట అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాకు సంబంధించిన వివరాలు పంచుకున్నాడు. ఈ నాయకానాయికలిద్దరూ గతంలో ‘కేసరీ’ అనే చిత్రంలో తెరపై కనిపించారు. మరోవైపు భూమి పెడ్నేకర్‌తో కలిసి అక్షయ్‌కుమార్‌ నటించిన ‘రక్షాబంధన్‌’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.