Payal Kothari: టీబీ.. డిప్రెషన్‌.. సమస్యలు అధిగమించి.. లక్షలాది మందికి హెల్త్‌ కోచ్‌గా!

Payal Kothari: టీబీ.. డిప్రెషన్‌.. సమస్యలు అధిగమించి.. లక్షలాది మందికి హెల్త్‌ కోచ్‌గా!‘‘జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు భవిష్యత్‌లో తమతోపాటు ఎంతోమంది జీవితాలను సరిదిద్దుకోవడానికి పాఠాలుగా మారతాయి. కష్టసమయాల్లో కిందపడి కెరటంలా పైకి లేచిన ప్రతిసారి మనకెదురయ్యే పరిష్కార మార్గాలు మన భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుతాయి. నా జీవితంలో అది జరగబట్టే ఈ రోజు నేను సెలబ్రెటీ గట్‌ హెల్త్‌ కోచ్‌గా మారాను’’ అని చెబుతోంది పాయల్‌ కొఠారి.  

ముంబైకి చెందిన పాయల్‌ కొఠారి కోల్‌కతాలోని గుజరాతీ జైన్‌ కుటుంబంలో పుట్టింది. పాయల్‌కు రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం ముంబైకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. అక్కడికి వచ్చిన కొద్దిరోజుల్లోనే పాయల్‌కు టీబీ వచ్చింది. చికిత్స తీసుకున్నాక నయమైంది కానీ జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింది. ఫలితంగా పోషకాహార లోపం ఏర్పడి, పదమూడేళ్లు వచ్చేవరకు బక్కపలుచగా ఉండేది తను.

వారి కామెంట్లను భరించలేని పాయల్‌ తీవ్ర నిరాశకు లోనై  సరిగా చదవలేకపోయేది. దీంతో ఫెయిల్‌ అయ్యింది.  ‘‘ఎవరేమి మాట్లాడినా పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకో’’ అని ఆమె తల్లి పదేపదే చెప్పడంతో డిప్రెషన్‌ నుంచి బయటపడింది. 

డిగ్రీ పూర్తయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్‌ స్కూల్‌ అయిన న్యూయార్క్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంట్రాగేటివ్‌ న్యూట్రిషన్‌(ఐఐఎన్‌) లో క్లినికల్‌ న్యూట్రిషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు చేసింది. 

దీంతో క్లినికల్‌ స్టడీ సర్టిఫికెట్‌ కోర్సు చేయడం, స్వయంగా తను కూడా ఒకప్పుడు ఒబెసిటీ బాధితురాలి నుంచి ఫిట్‌గా మారిన అనుభవంతో ‘గట్‌ హెల్త్‌ కోచ్‌’ గా మారాలనుకుంది. కోచ్‌గా పనిచేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో వెంటనే గట్‌ చోచ్‌గా మారింది. ప్రారంభంలో చుట్టూ ఉన్నవాళ్లకు, ఆ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ బాగా పాపులర్‌ అయ్యింది.

ఆన్‌లైన్‌ న్యూట్రిషన్‌ స్కూల్‌ ప్రారంభించి గట్‌ ఆరోగ్యం గురించి వివరించడంతోపాటు.. కాలేజీలు, యూనివర్శిటీల్లో సెమినార్లు నిర్వహిస్తోంది. వివిధ ఆర్టికల్స్‌ రాస్తూ ఫిట్‌నెస్‌ పట్ల అనేకమందిలో అవగాహన కల్పిస్తోంది. జాతీయ అంతర్జాతీయ న్యూట్రిషన్‌ సంస్థలతో కలిసి పనిచేస్తూ పదిమంది మెప్పూ పొందుతోంది పాయల్‌.