రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా హఠాన‍్మరణం, కుప్పకూలిపోతున్న షేర్లు!

స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా హఠాన‍్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత తొలిసారి ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌లో బిగ్‌బుల్‌కు చెందిన అన్నీ షేర్లు కుప్పకూలిపోతున్నాయి.   

♦ ముఖ్యంగా యాప్‌టెక్‌ లిమిటెడ్‌,స్టార్ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు 5శాతం నష్టపోయాయి.

♦ బిగ్‌ బుల్‌ టైటాన్‌ షేర్లు 1.54శాతం నష్టపోయాయి. గతవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఈ షేర్‌ వ‍్యాల్యూ రూ.2,471.95 ఉండగా.. ఇప్పుడు అదే షేర్‌ ప్రైస్‌ రూ.2,433వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

♦ జూన్‌ నెల త్రైమాసికం(వార్షిక ఫలితాలు)లో  టైటాన్‌ కంపెనీలో రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా, ఆయన భార్య రేఖ షేర్లు 5.10శాతంతో రూ.11,086.9కోట్లుగా ఉంది. 

♦ తొలి త్రైమాసికంంలో యాప్‌ టెక్‌ లిమిటెడ్‌లో రాకేష్‌ ఝన్‌ఝున్‌వాలా 23.40శాతంతో రూ.225కోట్లను పెట్లుబడులు పెట్టగా.. ఆయన మరణం కారణంగా బీఎస్‌ఈలో ఆ షేర్‌ వ్యాల్యూ క్షీణించింది. 3.67శాతం కంటే తక్కువగా రూ.224.20వద్ద ట్రేడ్‌ అవుతుంది. 

♦ బిగ్‌బుల్‌కు పెద్దమొత్తంలో పెట్టుబడులున్న స్టార్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు భారీ పతనమవుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌ కొనసాగే సమయానికి మునుపటి ముగింపు రూ .696.10తో పోలిస్తే 4.79 శాతం క్షీణించి రూ .662.75 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. జూన్ 2022 త్రైమాసికం నాటికి స్టార్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌లో  ఝున్‌ఝున్‌ వాలాకు 14.39 శాతంతో 8.28 కోట్ల షేర్లు, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 3.10 శాతంతో  1.78 కోట్ల షేర్లు ఉన్నాయి. స్టార్‌ హెల్త్‌లో ఝున్‌ఝున్‌వాటా విలువ రూ.7,017.5 కోట్లుగా ఉంది. 

♦ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఫోర్ట్‌పోలియోకి చెందిన టాటా మోటార్స్ స్టాక్స్‌ 0.68 శాతం క్షీణించి రూ .480.75 వద్ద ట్రేడింగ్‌ కొనసాగిస్తున్నాయి.  జూన్ త్రైమాసికం చివరి నాటికి టాటా మోటార్స్‌లో రూ .1731.1 కోట్ల విలువైన షేర్లున్నాయి.   

♦ బీఎస్‌ఈలో ఝున్‌ఝున్‌వాలా షేర్లున్న క్రిసిల్ లిమిటెడ్ షేరు మునుపటి ముగింపు రూ.3261.60 తో పోలిస్తే 0.56 శాతం క్షీణించి రూ .3243కు పడిపోయింది. జూన్ త్రైమాసికంలో క్రెడిట్ రేటింగ్ సంస్థలో ఆయనకు రూ .1301.9 కోట్ల విలువైన వాటా ఉంది. 

♦ ఫోర్టిస్ హెల్త్‌ కేర్‌ షేర్లు బీఎస్‌ఈలో 0.20 శాతం తగ్గి రూ .281.30 వద్ద ట్రేడవుతుండగా.. ఇలా బిగ్‌బుల్‌ కు చెందిన అన్నీ షేర్లు నష్టాల పాలవ్వడంతో మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.