నోటిఫికేషన్స్‌

క్రీడా ప్రాధికార సంస్థ.. న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)  నేషనల్‌ సెంటర్స్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ రిసెర్చ్‌లో ఒప్పంద ప్రాతిపదికన హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ/ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్సైజ్‌ సైన్స్‌/ స్పోర్ట్స్‌ సైన్స్‌/స్పోర్ట్స్‌ కోచింగ్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ సైన్స్‌/ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ మెడికల్‌/ హ్యూమన్‌/ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ ఫిజియాలజీ/ లైఫ్‌ సైన్స్‌/ బయోలాజికల్‌ సైన్సెస్‌/ సైకాలజీ/ బయోమెకానిక్స్‌/ అండ్‌ డైటీషియన్‌/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ బయోకెమిస్ట్రీ/ కెమిస్ట్రీ విత్‌ బయోకెమిస్ట్రీ), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)... అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్‌ లేదా సీనియర్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌(10+2), ఇంగ్లిష్‌/ హిందీ షార్ట్‌హ్యాండ్‌, టైపింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2022.ఉమ్మడి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత. అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాకు పంపించాలి.ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పారా మెడికల్‌, ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు.పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు, సంబంధిత ధ్రువపత్రాలను డీఎంహెచ్‌వో కార్యాలయం, శ్రీకాకుళం చిరునామాకు పంపాలి.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.