ఏ సైన్స్‌ ఎంచుకుందాం..?

తోడైతేనే సరైన ఎంపిక సాధ్యం. అందుకే మొక్కలు, జంతువులూ, రసాయనాలూ, పదార్థాల గురించి అధ్యయనం చేసే లైఫ్‌ సైన్స్‌.. ఇంట్లో తినే ఆహారం, ఇతర విషయాల గురించి చదివే హోమ్‌ సైన్స్‌ (కొత్త పేరు: కమ్యూనిటీ సైన్స్‌) గురించి విపులంగా తెలుసుకుందామా!రకరకాల మొక్కలు, జంతువులు, వైరస్‌, బ్యాక్టీరియా, కణాల గురించి అధ్యయనం చేయడాన్నే లైఫ్‌ సైన్స్‌ అంటున్నాం. మూడేళ్ల డిగ్రీలో ప్లాంట్‌ బయాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, జువాలజీ, ఫుడ్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్‌ సైన్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, బయోఇన్‌ఫర్మేటిక్స్‌ వంటి పలు సబ్జెక్టులు ఇందులో ఉంటాయి. బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు మాస్టర్స్‌, పీహెచ్‌డీ దాకా చదువును కొనసాగించవచ్చు.ఇంటి నిర్వహణ, అలంకరణ, రోజువారీ తీసుకునే ఆహారం, అందులో లభించే పోషకాల గురించి చదవడాన్నే హోమ్‌ సైన్స్‌ అంటున్నాం. మూడేళ్ల బీఏ, బీఎస్సీ డిగ్రీలో ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌, హోమ్‌ ఎకనమిక్స్‌, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ ప్రాసెసింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ చదువుకోవ కొన్ని సంస్థలు వొకేషనల్‌ బీఏలో భాగంగానూ హోం సైన్స్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంటుంది. (బీఎస్సీ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ అనేది హోమ్‌ సైన్స్‌లో ఒక బ్రాంచ్‌ మాత్రమే. ఇందుకు సంబంధించిన సబ్జెక్టులు వేరుగా ఉంటాయి.విద్య, ఆతిథ్య రంగం, పర్యటకం, వైద్య సంస్థలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఆహార పరిశ్రమల్లో వీరికి ఉద్యోగావకాశాలు ఎక్కువ.కొన్ని యూనివర్సిటీలు/కళాశాలలు ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా అడ్మిషన్లు అందిస్తాయి. ఫుడ్‌ అనలిస్ట్‌, హెల్త్‌కేర్‌ కౌన్సెలర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, మెడికల్‌ కోడర్‌, ప్రొఫెసర్‌.. వంటి ఉన్నతస్థాయి ఉద్యోగావకాశాలు. హోటళ్లు, ఆసుపత్రులు, న్యూట్రిషన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్లు, హెల్త్‌ క్లబ్‌లు, జిమ్‌ తదితర చోట్ల చక్కని కెరియర్‌ ఉంటుంది.ఆచార్య ఎన్‌జీ రంగా, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పలు కళాశాలలు యూజీ, పీజీ స్థాయుల్లో కోర్సులు అందిస్తున్నాయి.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.