Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డ్

Ease of Doing Business: సరళతర వ్యాపార నిర్వహణ( ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు లభించింది. మీసేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు ఈ పురస్కారం తెలంగాణను వరించింది. ది డీజీ టెక్ కాన్ క్లేవ్ 2022లో ఎకనామిక్ టైమ్స్ ఈ పురస్కారాన్ని అందజేయనుంది. నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖలతో పాటు స్వీడన్, ఇజ్రాయెల్ సహకారంతో కాన్‌క్లేవ్ నిర్వహించనున్నారు.

ఈ నెల 25న ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు పురస్కారం నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు సరళతర విధానంలో ప్రభుత్వం అనుమతి ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.