“భారీ, బోల్డ్ డిస్‌ప్లే, 110కుపైగా స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ ప్రూఫ్ డిజైన్‌తో Dizo Watch 2 Sports మార్చి 2న మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొస్తున్నాం” అని డిజో ట్వీట్‌లో పేర్కొంది. ఈ వాచ్ స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు చూడండి.
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో డిజో వాచ్ 2 స్పోర్ట్స్ అందుబాటులోకి రానుంది. ఈ వాచ్ కోసం మైక్రోసైట్‌ను Flipkart సృష్టించింది. 1.69 ఇంచుల పెద్ద టచ్ స్క్రీన్‌తో ఈ వాచ్ రానుంది. అలాగే 150కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. అలాగే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హై రిఫ్రెష్ రేట్ ఉంటుందని Dizo పేర్కొంది.
డిజో గత మోడల్ స్మార్ట్‌వాచ్ కంటే Dizo Watch 2 Sports 20 శాతం బరువు తక్కువగా ఉంటుంది. అలాగే క్లాసిక్ బ్లాక్, సిల్వర్ గ్రే, డార్క్ గ్రీన్, ప్యాషన్ రెడ్, ఓషియన్ బ్లూ, గోల్డెన్ పింక్ కలర్లలో ఈ వాచ్ అందుబాటులోకి వస్తుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
Dizo Watch 2 Sports 110+ స్పోర్ట్స్ మోడ్స్‌తో రానుంది. ఎస్‌పీఓ2 ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంటర్, కాలరీ ట్రాకర్, వాటర్ డ్రింక్ రిమైండర్ లాంటి హెల్త్ ఫీచర్లు ఉంటాయి. ఎక్సర్‌సైజ్, వర్కౌట్ రిపోర్టులను ట్రాక్ చేసేందుకు, వాచ్ సెట్టింగ్స్ మార్చుకునేందుకు డిజో యాప్ ద్వారా కూడా పని చేస్తుంది.
5ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో డిజో వాచ్ 2 స్పోర్ట్స్ వస్తుంది. అంటే నీటిలో 50మీటర్ల లోతు వరకు వెళ్లినా ఈ వాచ్ పని చేస్తుంది. ఇక ఫుల్ చార్జ్‌పై 10 రోజుల బ్యాటరీ లైఫ్ రానుంది. అలాగే 20 రోజుల బ్యాటరీ స్టాండ్‌బై ఉంటుందని Dizo పేర్కొంది. మొత్తంగా 2 గంటల్లో ఈ స్మార్ట్‌వాచ్ పూర్తిగా చార్జ్ అవుతుందని తెలిపింది.
Also Read: