డేవిడ్ ఉంటే వరల్డ్ కప్ గెలిచే అవకాశం Caption of Image. © V6 Velugu ద్వారా అందించబడింది Caption of Image.

విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ టీమ్లో ఉంటే ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలిచే అవకాశముందని మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపాడు. " నేనే సెలక్టర్ అయితే డేవిడ్ను ఎంపిక చేస్తా. అతడో మ్యాచ్ విన్నర్. స్టైకింగ్ పవర్ అద్భుతంగా ఉంటుంది. 2003 వన్డే ప్రపంచ కప్‌లో సైమండ్స్ ఏ విధంగా రాణించాడో.. ఇప్పడు డేవిడ్‌ అదే చేయగలడు. దీంతో టిమ్ డేవిడ్ను జట్టులోకి తీసుకుంటే ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టులో మిడిల్ ఆర్డర్‌లో మంచి ప్లేయర్లు ఉన్నారని నాకు తెలుసు. కానీ రెండేళ్లుగా డేవిడ్‌ టీ20ల్లో సూపర్గా రాణిస్తున్నాడు. ఒక్కసారైనా అతడికి ఆడే అవకాశం ఇవ్వాలి" అని పాంటింగ్‌ చెప్పాడు.

ఈ యువ ప్లేయర్ ఈ ఏడాది ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌ తరపున ఆడి అకట్టుకున్నాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై 8.25 కోట్లతో దక్కించుకోంది. లీగ్ మ్యాచ్లతో పాటు డేవిడ్‌ టీ20 క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నా.. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో ఇంకా చోటు దక్కలేదు.  సింగపూర్‌లో జన్మించిన టిమ్‌ డేవిడ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు ఎదురుచేస్తున్నాడు. టిమ్ డేవిడ్ ఇంతవరకు ఇంటర్నేషనల్ టీ20లతో పాటు.. బిగ్ బాష్ లీగ్(BBL), పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL), ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) మ్యాచుల్లో అదరగొడుతున్నాడు. 

  ©️ VIL Media Pvt Ltd.