టీ20 వరల్డ్ కప్ బెర్తులు ఖరారు

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. తాజాగా ఫస్ట్ రౌండ్ క్వాలిఫయర్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ఓడించి జింబాబ్వే తన స్థానాన్ని కన్ఫాం చేసుకుంది. దీంతో గ్రూప్ బీలో స్థానం దక్కించుకుంది. గ్రూప్-Bలో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే ఆడనున్నాయి.  గ్రూప్ Aలో నమీబియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ జట్టు ఉండనున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్ -2 పోజిషన్లో నిలిచిన జట్లు..సూపర్ -12 కు అర్హత సాధిస్తాయి. 


సూపర్ -12లో భాగంగా గ్రూప్ -1లో  ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, విజేత గ్రూప్ A, రన్నరప్ గ్రూప్-B లు ఉండనున్నాయి. గ్రూప్ 2లో  భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, రన్నరప్ గ్రూప్ ఎ, విజేత గ్రూప్ బి ఉంటాయి. 


ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో అక్టోబరు 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది.  మొత్తం 7 నగరాలు వరల్డ్ కప్ కు ఆతిధ్యం ఇవ్వబోతున్నాయి. ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లు జీలాంగ్, హాబర్ట్ లలో జరుగుతాయి. టీ20 వరల్డ్ కప్ ను భారత్ అక్టోబర్ 23న మొదలు పెట్టనుంది. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్తో ఆడబోతుంది.