Karthikeya 2 Pre Release Theatrical Business : కార్తికేయ 2 టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. హిట్ స్టేటస్‌కు ఎంత రాబట్టాలి..

Karthikeya 2 Pre Release Theatrical Business : కార్తికేయ 2 టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. హిట్ స్టేటస్‌కు ఎంత రాబట్టాలి..

Karthikeya 2 Total Pre Release Business : వరస విజయాలు, విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్ ఐకాన్‌గా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth). ప్రస్తుతం ఇతను చందూ మెండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ మూవీ చేసారు. ఈ సినిమా ఆగష్టు 13న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

వరస విజయాలు, విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్ ఐకాన్‌గా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth). కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త కథలు ప్రయత్నిస్తూనే ఉంటారు ఆయన. అలా నిఖిల్ ప్ర‌తిష్టాత్మ‌క థ్రిల్ల‌ర్ కార్తికేయ (Karthikeya). ఎనిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రంతో తెలుగు తెరకి ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా ఇతను ఆ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. (Twitter/Photo)

ఈ సినిమాకు  సెన్సార్  పూర్తి చేసుకున్న  అంతేకాదు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ మూవీ చూసి అద్భుతంగా ఉందన్నారు. కృష్ణుడి ద్వారకకు లింక్ చేసిన విధానం ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు సెన్సార్ వాళ్లు. ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..  (Twitter/Photo)

ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ)లో రూ. 3.50 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 1.8 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 6 కోట్లు తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ టోటల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. రూ. 11.30 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ 0.50 కోట్లు ఓవర్సీస్ -రూ. 1 కోటి టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 12.80 కోట్లు.. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 13.30 కోట్లు వసూళు చేయాలి. (Twitter/Photo)

ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా.. సామాన్య‌ ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా.. అల‌రించేలా త‌న పెన్‌కి ప‌ని పెట్టే ద‌ర్శ‌కుడు చందు మెుండేటి (Chandoo Mondeti) మ‌రొక్క‌సారి మ‌న‌కి తెలియ‌ని కొత్త క‌థతో వస్తున్న చిత్రం కార్తికేయ‌ 2. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మించాయి. (Twitter/Photo)

ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆగష్టు 5కు పోస్ట్ పోన్ చేశారు. చివరకు ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కార్తికేయ‌ 2 షూటింగ్ మొద‌ల‌య్యిన ద‌గ్గ‌ర‌ నుంచి సామాన్య ప్రేక్ష‌కుల్లో, సినిమా ప్ర‌ముఖుల్లో ఆసక్తి నెల‌కొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటించారు. (Twitter/Photo)

అనుపమ్ ఖేర్.. అపుడెపుడో ‘త్రిమూర్తులు’ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి కార్తికేయ 2తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా ఈయన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకెక్కారు. కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్య పురం నేపథ్యంలో తెరకెక్కిస్తే.. కార్తికేయ 2 స్టోరీ శ్రీ కృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.  డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్టుడి చ‌రిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాప‌ర యుగంలో జ‌రిగింది. ఇప్ప‌టికి ఆ లింక్ లో కార్తికేయ‌ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్ర‌యాణం.శ్రీ కృష్ణుడు ఆయ‌న‌కి సంబందించిన క‌థలో డాక్ట‌ర్ కార్తికేయ అన్వేష‌ణగా శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎలా ఎంటరయ్యారనేది ఈ సినిమా స్టోరీ. (Twitter/Photo)