విరాట్ కోహ్లీ ఫామ్ పై సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేక.. సతమతమౌవుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఫ్యాన్స్‌ కూడా కోహ్లీపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ ఫామ్‌ పై మరోసారి బిసిసిఐ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న కోహ్లీకి దాదా మద్దతుగా నిలిచాడు. కోహ్లీ గొప్ప ఆటగాడని, అతను సాధించిన పరుగులే ఇందుకు సాక్ష్యం అని, ఆసియా కప్ లో రన్ మెషిన్ పూర్వపు ఫామ్ ను తిరిగి అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కోహ్లీ తన ఫామ్ ను అందుకునేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడని, అతనికి తగినన్ని అవకాశాలు కల్పిస్తే పూర్వ వైభవం తప్పక సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా కోహ్లీ సెంచరీ మాత్రమే సాధించలేదని, జట్టుకు ఉపయోగపడే పరుగులు అతని బ్యాట్ నుంచి జాలువారతూనే ఉన్నాయని వెనకేసుకొచ్చాడు. స్పోర్ట్స్ తక్ అనే ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఫామ్ పై దాదా ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.