Data Science: డేటా సైన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.. 

Data Science: డేటా సైన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.. 

Data Science: డేటా సైన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.. 

డేటాకు సంబంధించిన రంగాలకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. లాజిస్టిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా ఆర్కిటెక్చర్, డేటా సైన్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. అయితే డేటా సైన్స్ ఉద్యోగాలకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

డేటాకు సంబంధించిన రంగాలకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. లాజిస్టిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా ఆర్కిటెక్చర్, డేటా సైన్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. అయితే డేటా సైన్స్ ఉద్యోగాలకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కోడింగ్, ఎనలిటిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా విజువలైజేషన్ వంటివన్నీ ఇందుకు అర్హతగా ఉంటున్నాయి. జీతం కూడా చక్కగా ఉండడంతో ఇతర రంగాలతో పోలిస్తే ఈ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెషర్స్ ఈ రంగంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారు ముందు నుంచే అన్నీ తెలుసుకొని ఉండాలని సంస్థలు కోరకోకపోయినా.. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మాత్రం నాలెడ్జ్ ఉండాలని భావిస్తున్నాయి. అందుకే డేటా సైన్స్ విభాగంలో ఉద్యోగాలు సంపాదించాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి.

ఏ రంగంలోకి అడుగుపెట్టాలన్నా ఆ రంగానికి సంబంధించిన విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక డేటా సైంటిస్టులు కష్టమైన నిజ జీవిత సంబంధ సమస్యలకు సమాధానం చూపించాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు సాఫ్ట్ స్కిల్స్ తో పాటు మీ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్చుకోవడం మంచిది. డేటా సైన్స్ ఫండమెంటల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, డేటా విజువలైజేషన్, డేటా మానిపులేషన్, డేటా అనాలిసిస్ వంటివన్నీ నేర్చుకోవచ్చు . వీటితో పాటు మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, బిగ్ డేటా వంటివి కూడా ముఖ్యమైనవి. వీటితో పాటు టీం వర్క్, టైం మేనేజ్ మెంట్, కొలాబరేషన్, కమ్యునికేషన్, స్ట్రక్చర్డ్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, మేనేజ్ మెంట్ స్కిల్స్ వంటివి కూడా నేర్చుకోవచ్చు.

మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే మీ ఇంట్రస్టులకు సంబంధించిన కోర్సులు నేర్చుకోవడం మంచిది. షార్ట్ టర్మ్, డేటా సైన్స్ ట్రైనింగ్ వంటివన్నీ నేర్చుకోవచ్చు. డేటా సైన్స్ లో నాలుగు నుంచి ఆరు నెలల స్పెషలైజేషన్ చేస్తే చాలా మంచిది. దీనివల్ల సర్టిఫికెట్, ప్లేస్ మెంట్ అసిస్టెన్స్ వంటివన్నీ అందుతాయి.

మీ పోర్ట్ ఫోలియో పూర్తిగా ఉండాలి. దానివల్ల మీరు ఉద్యోగాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెజ్యుమె, కవర్ లెటర్ మాత్రమే కాదు.. ప్రతి విషయంలోనూ మీ క్యాండిడేచర్ కనిపించేలా మీ పోర్ట్ ఫోలియో ఉండాలి. అందుకే మీరు అప్లై చేసే రంగానికి తగ్గట్లుగా మీ డిజిటల్ పోర్ట్ ఫోలియోని సిద్ధం చేసుకొని దాన్ని రిక్రూటర్లతో షేర్ చేయడం మంచిది. మీకు డేటా సెట్స్, స్ట్రక్చర్స్, మోడల్స్, ఇన్ సైట్స్ వంటివాటిలో తెలిసిన వాటన్నింటినీ ఇందులో చేర్చండి. మీరు ఇంతవరకు చేసిన పనులు, సాధించిన విజయాలు మీ ప్రాజెక్టుల వివరాలు అన్నీ పొందుపర్చండి.

బిగినర్ లెవెల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత డేటా సైన్స్ లో ఇంటర్న్ షిప్ చేయడం కూడా అవసరమే. ఇది ఈ రంగంలోకి మీ స్కిల్స్ ని మరింత మెరుగుపర్చుకునేలా చేస్తుంది. మీకు థియరీ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని ప్రాక్టికల్ గా అమలు చేయడానికి వీలుగా ఇంటర్న్ షిప్ మీకు సహాయపడుతుంది. మీకు తగిన ఇన్ కం కూడా అందిస్తుంది.

మీరు డేటా సైన్స్ రంగంలో అడుగుపెట్టాలనుకుంటుంటే ఆ రంగంలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న అప్ డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. టెక్నలాజికల్ అడ్వాన్స్ మెంట్స్, బెస్ట్ ప్రాక్టీసులు, కస్టమర్ బిహేవియర్ లో మార్పులు, గ్లోబల్ యాక్టివిటీస్ వంటివన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. డేటా సైన్స్, ప్రోగ్రామింగ్ గ్రూప్స్ లో యాక్టివ్ గా ఉండాలి. నిపుణుల నుంచి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఫీల్డ్ కి సంబంధించి సాధారణంగా జరిగే అప్ డేట్స్ గమనించాలి. ఇవన్నీ మీకు నచ్చిన ఉద్యోగం పొందేందుకు, కొత్త అవకాశాలు కల్పించేందుకు సాయపడతాయి.