Business Ideas: కొత్త బిజినెస్ కు డబ్బులు కావాలా...బ్యాంకు లోన్ అవసరం లేకుండానే...ఫండ్ సంపాదించే చాన్స్...

Business Ideas: కొత్త బిజినెస్ కు డబ్బులు కావాలా...బ్యాంకు లోన్ అవసరం లేకుండానే...ఫండ్ సంపాదించే చాన్స్...
Business Ideas: కొత్త బిజినెస్ కు డబ్బులు కావాలా...బ్యాంకు లోన్ అవసరం లేకుండానే...ఫండ్ సంపాదించే చాన్స్...
క్రౌడ్ ఫండింగ్ (Crowdfunding) ద్వారా నిధుల సమీకరణం చేయడం ఒక పద్ధతి. ప్రస్తుతం దీనికి ఎటువంటి రెగ్యులేటరీ నిబంధనలు లేవు. అయితే ప్రస్తుతం స్టార్టప్ కల్చర్ లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా పెట్టుబడిని సేకరించే ట్రెండ్ ఊపందుకుంది.
Crowdfunding | మనం సాధారణంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి అనేది చాలా పెద్ద సమస్య అనే చెప్పాలి. పెట్టుబడి కోసం బ్యాంకులు, వ్యక్తులు, సంస్థలు ఇలా రకరకాల దారులు వెతుకుతుంటాం. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, వెంచర్ క్యాపిలిస్ట్ లు సంప్రదించడం ఇలా మార్గాలు చాలానే ఉన్నాయి. అయితే కొంచెం వినూత్నంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధుల సమీకరణం చేయడం ఒక పద్ధతి. ప్రస్తుతం దీనికి ఎటువంటి రెగ్యులేటరీ నిబంధనలు లేవు.
అయితే ప్రస్తుతం స్టార్టప్ కల్చర్ లో క్రౌడ్ ఫండింగ్ (Crowdfunding) ద్వారా పెట్టుబడిని సేకరించే ట్రెండ్ ఊపందుకుంది. నిజానికి క్రౌడ్ అంటే ఒక సమూహం అనే అర్థం. క్రౌడ్ ఫండింగ్ అంటే వివిధ వ్యక్తుల నుంచి పెట్టుబడులు లేదా విరాళాలు సేరించడం కోవ కిందకు వస్తుంది. అయితే క్రౌడ్ ఫండింగ్ అనేది ప్రస్తుతం ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ కాన్సెప్ట్, లేదా బిజినెస్ మోడల్ కు నిధులు సమకూర్చుకుంటున్నారు.
ఒక వెబ్ సైట్, లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మీ కాన్సెప్ట్ ను ప్రెజెంట్ చేయాలి. అప్పుడు దానిపై ఆసక్తి ఉన్న వారు మీ కాన్సెప్ట్ లో డబ్బు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీన్నే క్రౌడ్ ఫండింగ్ అంటారు. అయితే ఈ ఫండ్స్ కూడా చిన్న మొత్తాలుగా ఉంటాయి. రూ. 100 నుంచి రూ.10000 వరకూ మీ ఫండ్ మొత్తాన్ని పెట్టుకునే వీలుంది.
సాధారణంగా క్రౌడ్ ఫండింగ్ అనేది సామాజిక కోణంలో చేసే సేవ కింద వస్తుంది. కాబట్టి వీటిలో చేసే నిధులను పెట్టుబడి కాదు విరాళం కింద చూస్తారు. వచ్చిన విరాళాలను కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమయ్యే నిధులు అందిస్తారు. ఈ సేవా కార్యక్రమాలు ఆరోగ్యం, విద్య, ఆహారం తదితర అంశాలకు చెంది ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసే వారి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు.
చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలనుకునే వారికి లేదా జనం నుంచి నిధులు సమీకరించి సేవాకార్యక్రమాలను చేయాలనుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలు (ఎస్ఎమ్ఈ) స్థాపించాలనుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి. ఆన్ లైన్ లో నిధులు సేకరించేవారికి kickstarter, fundable ఇలా చాలా సంస్థలు ఆన్‌లైన్ వేదికగా సేవలు అందిస్తున్నాయి.
ఈ వెబ్ సైట్స్ లో మీ ప్రాజెక్టు వివరాలు తెలుపుతూ బిజినెస్, లేదా ఏదైనా సోషల్ యాక్టివిటీకి ఫండ్ రైజ్ చేయవచ్చు. అయితే మీ ప్రాజెక్టుకు ఎవరు మాత్రం ఎందుకు డబ్బులు ఇస్తారు అనే సందేహం మీకు ఏర్పడవచ్చు. ఉదాహరణకు ఒక స్మార్ట్ వాచ్ తయారు చేయాలని క్రౌడ్ ఫండింగ్ (Crowdfunding) ద్వారా నిధులు సేకరించినట్లయితే...మీరు ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత మీకు విరాళం పంపినవారికి ఉచితంగా స్మార్ట్ వాచ్ పంపాలి. అప్పుడు మీరు తయారు చేసే మరిన్ని ప్రాజెక్టుల్లో కూడా క్రౌడ్ ఫండింగ్ నిధులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. దీన్నే రివార్డ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ అంటారు.
అలాగే మీరు ఏదైనా ఒక ఈ కామర్స్ సైట్ ఓపెన్ చేసి, క్రౌడ్ ఫండింగ్‌కు వెళ్లారు అనుకుంటే...ఎవరైతే మీకు క్రౌడ్ ఫండింగ్ చేశారో వాళ్లందరికీ ఒక సంవత్సరం పాటు ఉచితంగా సర్వీసు ఇస్తే మీ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీరు షేర్ల రూపంలో వారికి వాటాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాడక్టు, లేదా సర్వీసును వారికి ఉచితంగా అందిస్తే చాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.