Snacks Business Idea: కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ బిజినెస్ ఐడియాను పరిశీలించండి

Snacks Business Idea: కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ బిజినెస్ ఐడియాను పరిశీలించండి
Snacks Business Idea: కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ బిజినెస్ ఐడియాను పరిశీలించండి
సొంతంగా బిజినెస్ (Business) చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ స్నాక్స్ తయారీ బిజినెస్ పై ఓ లుక్కేయండి. ఈ బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
మీ ఇంట్లో వారికి ఎవరికైనా పిండి వంటలు తయారు చేయడం వచ్చి.. మీకు సహకరించడానికి ఆసక్తి ఉంటే ఈ వ్యాపారం నిర్వహించడం మీకు చాలా సులువు అవుతుంది. లేకపోతే పిండి వంటలు చేయగలిగిన వారిని నియమించుకోవచ్చు. వారికి జీతం ఇవ్వొచ్చు లేదా వాటా ఇచ్చేలా కూడా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొంచెం పెద్దగా ఈ బిజినెస్ ను ప్రారంభించాలనుకుంటే మాత్రం వివిధ రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ఫుడ్ లైసెన్స్, MSME రిజిస్ట్రేషన్ మరియు GST రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉన్నాయి.
ఇంకా ఈ వ్యాపారం ప్రాంభించడానికి ముందు అన్ని రకాల పిండి, నూనె, శనగపిండి, ఉప్పు, నూనె, మసాలాలు, వేరుశెనగలు, పప్పులు మీకు అవసరం. వంట మిషనరీ తో పాటు ప్యాకేజింగ్ మరియు వెయింగ్ మెషిన్ మొదలైన కొన్ని యంత్రాలు అవసరం. దీనితో పాటు, మీకు 1-2 మంది ఉద్యోగులు కూడా అవసరం.
ఈ వ్యాపారాన్ని ఓ ఐదు వేలతో కూడా ప్రారంభివచ్చు. కొంచెం పెద్ద స్థాయిలో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా అనుకుంటే కనీసం 2 నుండి 6 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీ వ్యాపారం సక్సెస్ అయితే.. మీకు 20 నుండి 30 శాతం వరకు లాభాలు వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.