స్వాతంత్య్రం అనంతరం భారత్‌లో శాస్త్రపరిశోధనలు.. సాధించిన మైలురాళ్లు

భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత వేగంగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. ఆకలి కేకల నుంచి ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను అందించగలిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్‌లలో అభివృద్ధితోపాటు మిలిటరీ అవసరాలను స్వయంగా తీర్చుకునే స్థాయికి మన దేశం ఎదిగింది.
 

న్యూఢిల్లీ: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వాతంత్ర్యం పొందిన తర్వాతే వడిగా ముందుకు వెళ్లగలిగింది. సున్నాను ప్రపంచానికి అందించిన ఆర్యభట్ట, సైన్స్ మ్యాస్ట్రో సివి రామన్ వంటి మేధావులు పుట్టిన మన దేశం ఇప్పుడు శాస్త్రపరిశోధనల్లో వేళ్ల మీద లెక్కించగలిగే దేశాల సరసన ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్‌లలో అభివృద్ధితోపాటు మిలిటరీ అవసరాలను స్వయంగా పరికరాలను తయార చేసుకుకునే దశకు మన దేశం ఎగబాకింది.

స్వాతంత్ర్యం పొందిన వెంటనే మన దేశంలో పంచ వర్ష ప్రణాళిక విధనాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ప్రణాళికల్లో వ్యవసాయం, సైన్స్, మౌలిక వసతులు, విద్యా రంగాలకు తొలుత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్లాన్డ్‌ డెసిషన్స్ కారణంగా భారత్ ఒకప్పుడు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం నుంచి ఎగుమతి చేసే దేశంగా.. ఆహార సంపన్న దేశంగా ఎదిగింది. ఈ సైన్స్ టెక్నాలజీతో భారత్‌లో హరిత విప్లవం వచ్చింది. ఈ హరిత విప్లవం భారత్‌ను స్వయం సమృద్ధ దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టింది.