ఇంజినీరింగ్ కాలేజీల్లో 18 నుంచి ఎఫ్‌ఎఫ్‌సీ తనిఖీలు

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెల 18 నుంచి అఫిలియేషన్లకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీలు ప్రారంభం కాబోతున్నాయని జేఎన్‌టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెల 18 నుంచి అఫిలియేషన్లకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీలు ప్రారంభం కాబోతున్నాయని జేఎన్‌టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈలోపే అఫిలియేషన్ పొందిన కాలేజీలు, కోర్సులు, సీట్ల వివరాలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నారని, దాని వల్ల ఆయా కోర్సులకు టీచింగ్ ఫ్యాకల్టీ, వారికి ఇచ్చే జీతాలు, వారి క్వాలిఫికేషన్ వంటి వివరాలు తెలుసుకున్నామని, వెంటనే వాటికి అనుమతి ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు.