కెఎల్ రాహుల్ వస్తే దినేశ్ కార్తీక్ పరిస్థితి ఏంటి... ఏ పొజిషన్‌లో ఆడతాడు! టీ20 వరల్డ్ కప్ జట్టులో...

కెఎల్ రాహుల్ వస్తే దినేశ్ కార్తీక్ పరిస్థితి ఏంటి... ఏ పొజిషన్‌లో ఆడతాడు! టీ20 వరల్డ్ కప్ జట్టులో...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు, ఘోర పరాజయాలతో గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. ఈసారి ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం కప్‌తో తిరిగి రావాలనే పట్టుదలతో ఉంది. అయితే గత ఏడాది లాగే ఈసారి కూడా భారత జట్టును కాంబినేషన్ సమస్యలు వెంటాడబోతున్నాయి...

దాదాపు మూడు నెలల క్రితం గాయం కారణంగా ఆటకి దూరమైన కెఎల్ రాహుల్, ఈ నెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2022 ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది ఇప్పుడు టీమిండియాకి పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడిన దినేశ్ కార్తీక్ 16 మ్యాచుల్లో 183.33 స్ట్రైయిక్ రేటుతో 330 పరుగులు చేసి, మూడేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకోగలిగాడు... రీఎంట్రీ దగ్గర్నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు దినేశ్ కార్తీక్...

ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని ఓపెనర్‌గా ఆడిస్తూ దినేశ్ కార్తీక్‌ని ఏడో స్థానంలో ఆడిస్తోంది టీమిండియా. అయితే కెఎల్ రాహుల్ జట్టులోకి వస్తే పూర్తి బ్యాటింగ్ ఆర్డర్ మారిపోతుంది...

ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ వస్తే వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా వరుసగా బ్యాటింగ్‌కి వస్తారు... 

ఆ తర్వాత బౌలర్లు బ్యాటింగ్‌కి రావాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్ కావడంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు బదులుగా నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాని అనుసరించే అవసరం కూడా ఉంది. ఎలా చూసినా రవీంద్ర జడేజాకి చోటు గ్యారెంటీ...

దీంతో దినేశ్ కార్తీక్‌ని ఆడించాలంటే రిషబ్ పంత్‌ని పక్కనబెట్టాల్సి ఉంటుంది. కొంతకాలంగా టీమిండియాకి మ్యాచ్ విన్నర్‌గా మారిన రిషబ్ పంత్‌ని పక్కనబెట్టడమనేది చాలా పెద్ద సాహసమే అవుతుంది...
 

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్‌ని తుదిజట్టులో ఆడించడం చాలా కష్టమవతుంది. రిషబ్ పంత్‌ని ఆడించాలంటే దినేశ్ కార్తీన్‌ని పక్కనబెట్టాలి. దినేశ్ కార్తీక్‌ కావాలంటే రిషబ్ పంత్‌ని వదులుకోవాలి...
 

ఒకవేళ ఇద్దరూ తుదిజట్టులో ఉండాల్సిందే అనుకుంటే రవీంద్ర జడేజాని రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి ఉంటుంది. తీరా టీ20 వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్‌ని ఆడించకపోతే, ఇప్పటిదాకా ఆడిందంతా డ్రెస్ రిహాసల్స్‌గా మారిపోద్ది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

ఒకవేళ రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చి అతను ఫెయిల్ అయినా, అతన్ని కాదని దినేశ్ కార్తీక్‌ తుదిజట్టులో వచ్చి ఫెయిల్ అయినా ట్రోలింగ్ ఎదుర్కోబోయేది బీసీసీఐ సెలక్టర్లే...