ఛాన్సే లేదు! ఈసారి ఆసియా కప్ గెలిచేది వాళ్లే... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం...

ఛాన్సే లేదు! ఈసారి ఆసియా కప్ గెలిచేది వాళ్లే... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం...

టీ20 వరల్డ్ కప్ 2022 ఆరంభానికి ముందు ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోతోంది భారత జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న టీమిండియా, ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాని ఓడించిన పాకిస్తాన్ కూడా ఆసియా కప్‌లో ఫెవరెట్‌గా ఆడనుంది...

ఏడుసార్లు ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు, ఆగస్టు 28న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు...

‘టోర్నమెంట్ ఏదైనా టీమిండియాని ఓడించడం అంతే తేలికైన విషయం కాదు. ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ టోర్నీలోనూ వాళ్లు ఫెవరెట్స్.. నా ఉద్దేశంలో కూడా ఈసారి ఆసియా కప్ గెలిచేది వాళ్లే...

ఎందుకంటే భారత జట్టులో డెప్త్ పటిష్టంగా ఉంది. మిగిలిన జట్ల కంటే పాకిస్తాన్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్, పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉంది. ఆ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు కూడా ఎక్కువే...

ఈసారి పాకిస్తాన్‌పై టీమిండియా తప్పక విజయం సాధిస్తుంది. నేను పాకిస్తాన్‌ని తక్కువ అంచనా వేయడం లేదు. అది కూడా బలమైన జట్టే.. ఆ టీమ్‌లోనూ స్టార్ ప్లేయర్లు ఉన్నారు...

ఇప్పుడు భారత జట్టు అత్యంత బలంగా తయారైంది. 15-20 ఏళ్ల కిందట మేం ఆడిన జట్టు ఇలా లేదు. భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లను ఇంట్రెస్టింగ్‌గా చూస్తాను. ఎందుకంటే ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్‌లాగే ఇండో - పాక్ కూడా చిరకాల ప్రత్యర్థులు...

ఇండియా, పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచులు మళ్లీ జరగాలని గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి జట్ల మధ్య టెస్టు మ్యాచులు జరిగితే, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. టెస్టులకు క్రేజ్ కూడా పెరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

‘టీమిండియాకి మహ్మద్ షమీ చాలా కీలక బౌలర్. అతని బలం టెస్టుకి సరిగ్గా సరిపోతుంది. సుదీర్ఘ స్పెల్స్ వేసే బౌలర్ ఏ జట్టుకైనా అవసరమే. టీ20ల్లో టీమిండియాకి చాలామంది బౌలర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి షమీని టెస్టులకు అట్టిపోవడమే కరెక్ట్...’ అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్..