Rana Daggubati: ఫాలోవర్లకు షాకిచ్చిన రానా.. ఇన్‏స్టా నుంచి అన్ని పోస్టులు డిలీట్.. ఎందుకంటే..

Rana Daggubati: ఫాలోవర్లకు షాకిచ్చిన రానా.. ఇన్‏స్టా నుంచి అన్ని పోస్టులు డిలీట్.. ఎందుకంటే..

తాజాగా తన సోషల్ మీడియా ఫాలోవర్లకు షాకిచ్చాడు రానా. తన ఇన్ స్టాలోని అన్ని పోస్టులను డెలీట్ చేశారు.

ఇటీవల విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా (Rana Daggubati). నక్సలైట్ రవన్న పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం తన బాబాయ్ వెంకటేశ్‏తో కలిసి నెట్ ఫ్లిక్ వెబ్ సిరీస్ రానానాయుడులో నటిస్తున్నారు. అయితే రానా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. కుటుంబానికి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు. తాజాగా తన సోషల్ మీడియా ఫాలోవర్లకు షాకిచ్చాడు రానా. తన ఇన్ స్టాలోని అన్ని పోస్టులను డెలీట్ చేశారు. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆగస్ట్ 5న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన ఖాతాలోని అన్ని పోస్టులను డెలీట్ చేశారు.

కొంతకాలం సోషల్ మీడియా నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పెద్ద, ఉత్తమమైన, శక్తివంతమైన చిత్రాలతో మళ్లీ కలుద్దాం. మీపై అమితమైన ప్రేమతో.. రానా అంటూ ఆగస్ట్ 5న ట్వీట్ చేశారు. ఇక చెప్పినట్లుగానే తన సోషల్ మీడియా ఖాతా నుంచి అన్ని పోస్టులను డెలీట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా రానా సతీమణి మిహీక బజాజ్ తమ రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిద్దరికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. తమ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.