Mahesh Babu: ‘రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే అలా ఉంటుంది’.. జక్కన్న మూవీపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Mahesh Babu: ‘రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే అలా ఉంటుంది’.. జక్కన్న మూవీపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రం ఆఫ్రికల్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వైంచర్ అని టాక్ వినిపిస్తోంది. యాక్షన్, థ్రిల్స్ డ్రామాతో రాబోతుందని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నేటితో 47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్బంగా శుభాకాంక్షలతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇటీవలే సర్కారు వారి పాటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీనే కాకుండా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలోనూ మహేష్ ఓ మూవీ చేయనున్నాడు. అయితే జక్కన్న డైరెక్షన్లో సినిమా చేస్తే ఒకేసారి 25 చిత్రాలు చేసినట్లే అని.. శారీరకంగా చాలా డిమాండ్ ఉంటుందన్నారు.

ఇటీవలే ఈ టైమ్స్‏తో మాట్లాడిన మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేష్ మట్లాడుతూ.. ” ఆయనతో కలిసి పని చేయాలనే నా కల నిజమైంది. రాజమౌళి గారితో ఒక్క సినిమా చేయడం అంటే 25 సినిమాలు తీసినట్లే. ఇది శారీరకంగా చాలా డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి చాలా సంతోషిస్తున్నాను. ఇది పాన్ ఇండియా చిత్రం. మేము అనేక అడ్డంకులు అధిగమించి మా పనిని దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తామని ఆశీస్తున్నాను. ” అంటూ చెప్పుకొచ్చారు. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రం ఆఫ్రికల్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వైంచర్ అని టాక్ వినిపిస్తోంది. యాక్షన్, థ్రిల్స్ డ్రామాతో రాబోతుందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.