Pokiri: రి-రిలీజ్‌ సినిమాకు కూడా కోట్లలో కలెక్షన్ల వరద.. Mahesh babu అంటే ఇది.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్

Pokiri: రి-రిలీజ్‌ సినిమాకు కూడా కోట్లలో కలెక్షన్ల వరద.. Mahesh babu అంటే ఇది.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్

ఎవ్వరి సినిమా జస్ట్ హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలువుతాయో ఆయనే మహేశ్ బాబు. ఇక సూపర్ స్టార్‌కు ఉన్న ఫ్యాన్స్ బేస్‌ గురించి స్పెసల్‌గా చెప్పాలా..?

ఊహించినట్లుగానే, ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పోకిరి స్పెసల్ షోలకు ఫ్యాన్స్ హాజరయ్యారు. ఫలితంగా ఆగస్ట్ 9న రీ-రిలీజ్ అయిన పోకిరి అన్ని చోట్లా భారీ విజయం సాధించి కలెక్షన్లను రాబట్టింది. పోకిరి స్పెషల్ షోలు ప్రపంచ వ్యాప్తంగా 1.73 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేశాయి. టాలీవుడ్‌లో రీ-రిలీజ్ అయిన ఏ సినిమాకు ఇంత కలెక్షన్ రాలేదు. భారతీయ సినిమా చరిత్రలో కూడా ఇది ఎన్నడూ లేని రికార్డు అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబుకు జోడిగా ఇలియానా నటించింది. ఈ కల్ట్ మూవీకి మణిశర్మ సౌండ్‌ట్రాక్‌లు అందించారు.

Nizam 69,07,433 UA 24,89,638 Guntur 13,02,265 East 11,78,820 Ceded 13,36,902 Krishna 10,25,251 West 5,39,694 Nellore 4,41,752 ROI – 4,01,875 OS – 17,03,611/-