RCB vs GT Highlights, IPL 2022: ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ పై బెంగళూరు విజయం

RCB vs GT Highlights, IPL 2022: ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ పై బెంగళూరు విజయం

Royal Challengers Bangalore vs Gujarat Titans Live Score in Telugu: IPL 2022లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

IPL 2022 15వ సీజన్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లి (73), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (44)ల అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. IPL-2022 ప్లేఆఫ్స్‌లో నిలవడానికి బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం అవసరం . అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో కోహ్లి, డు ప్లెసిస్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి జట్టును రేసులో నిలిపారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62 నాటౌట్), రషీద్ ఖాన్ (19 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.

బెంగళూరు: విరాట్ కోహ్లీ, డూప్లిసెస్, రజత్ పాటిదార్, మాక్సివెల్, లోమరర్, దినేష్ కార్తిక్, షబజ్, హసరంగ, హర్షల్ పటేల్, సిదార్థ్‌ కౌల్, హజిల్‌వుడ్‌

గుజరాత్‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్, మాథ్య్‌ వెడ్, హార్దిక్‌ పాండ్యా, డెవిడ్ మిల్లర్, తెవాటియా, రషీద్‌ ఖాన్‌, రవిశ్రీనివాస్ సాయి కిషోర్, ఫర్గ్‌సన్‌, యశ్ దయల్, షమీ