Business Ideas: ఉన్న ఊళ్లోనే కింగ్‌లా బతకొచ్చు.. ఈ బిజినెస్‌తో నెలకు రూ.50వేల ఆదాయం

BUSINESS IDEAS START MINERAL WATER PLANT IN YOUR VILLAGE YOU CAN EARN RS 50000 PER MONTH EASILY SK

Business Ideas: ఉన్న ఊళ్లోనే కింగ్‌లా బతకొచ్చు.. ఈ బిజినెస్‌తో నెలకు రూ.50వేల ఆదాయం

Business Ideas: నగరాలకు వెళ్లి ఉద్యోగం చేయాలన్న ఇంట్రెస్ట్ లేదా? ఉన్న ఊళ్లోనే మంచి ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఐతే మీ కోసం ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం. తక్కువ పెట్టుబడితో చేసే ఈ వ్యాపారంతో నెలకు రూ.50వేల వరకు సంపాదించవచ్చు.

మనదేశంలో మినరల్ వాటర్ బిజినెస్ (Mineral Water Business) ఏటేటా పెరుగుతోంది. బాటిల్ వాటర్ వ్యాపారం ఏటా 20% చొప్పున వృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. వాటర్ ప్యాకెట్ల, బాటిళ్ల రూపంలో విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి.

మీరు మినరల్ వాటర్ (Mineral water plant) వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ముందుగా ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేయాలి. కంపెనీల చట్టం కింద దానిని నమోదు చేయాలి. పాన్ నంబర్, GSTనంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయండి. అధికార యంత్రాంగ నుంచి లైసెన్స్, ISI నంబర్ తీసుకోవాలి.

కొందరు ఇవేమీ లేకుండా.. జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతుంటారు. ఇలా చేయడం రిస్క్. చట్ట ప్రకారం నిర్వహిస్తేనే.. మన్ముందు ఎలాంటి సమస్యలు రావు. వాటర్ ప్లాంట్ కోసం.. బోరు, ఆర్‌వో ఫిల్టర్‌తో పాటు పలు యంత్రాలు అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేసేందుకు 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమై, స్వచ్ఛమైన వాటర్‌ని అందించవచ్చు. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ ఓ ప్లాంట్లను తయారుచేస్తున్నాయి. వాటికి రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనితో పాటు 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 100 వాటర్ క్యాన్‌లను కొనుగోలు చేయాలి.

అన్ని ఖర్చులు కలిపి.. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత డబ్బు మీ వద్ద లేకుంటే.. బ్యాంకు నుంచి రుణం కూడా పొందవచ్చు. గంటకు 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నెలకొల్పితే.. కనీసం రూ.30,000 నుంచి రూ.50,000 వరకు సులభంగా సంపాదించవచ్చు.

మీకు 200 మంది కస్టమర్లు ఉడి.. వారికి రోజుకు ఒక బాటిల్ చొప్పున సరఫరా చేస్తున్నారని అనుకుందాం. ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.25. అంటే రోజుకు రూ.5వేలు వస్తాయి. నెలకు లక్షా రూ.50వేలు ఆదాయం వస్తుంది.

ఇందులో కరెంటు బిల్లు, డీజిల్, సిబ్బంది జీతం ఖర్చులు లక్ష రూపాయల వరకు పోయినా.. మీకు రూ.50వేల నికర లాభం వస్తుంది. కస్టమర్లు పెరిగే కొద్దీ.. లాభం కూడా పెరుగుతుంది. ఎండాకాలంలో నీళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)