Business Ideas: సొంతూర్లో ఉంటూ ఈ వ్యాపారాలు చేయొచ్చు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు

BUSINESS IDEA IN TELUGU YOU CAN START DAIRY FARM SOIL INFORMATION LAB PRODUCTION OF ANIMAL FEED WITH LESS INVESTMENT SK

Business Ideas: సొంతూర్లో ఉంటూ ఈ వ్యాపారాలు చేయొచ్చు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు

Business Ideas: మీరు గ్రామాల్లో ఉంటారా? ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నారా? ఐతే గ్రామాల్లో ఉంటూనే బాగా డబ్బు సంపాదించే మార్గాలు చాలానే ఉన్నాయి. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు పొందవచ్చు.

కష్టపడి పనిచేయాలో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. మీది ఒకవేళ గ్రామీణ కుటుంబ నేపథ్యమైతే.. అక్కడే ఉంటూ వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు తెచ్చే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)

డైరీ ఫార్మింగ్, సాయిల్ ఇన్ఫర్మేషన్ ల్యాబ్, పశుగ్రాసం ఉత్పత్తి వంటి వ్యవసాయ సంబంధ వ్యాపారాలు గ్రామీణ ప్రజలకు మంచి ఉపాధి అవకాశాలు. దీనికి లక్షలకు లక్షలు పెట్టుబడి కూడా అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వ సహాయంతో మీ స్వగ్రామంలోనే డైరీ ఫార్మింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కేవలం 10 వేల రూపాయల పెట్టుబడితో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. మీరు తక్కువ పెట్టుబడితో పనిని ప్రారంభించాలనుకుంటే.. రెండు ఆవులు లేదా గేదెలతో పాడి పరిశ్రమను ప్రారంభించవచ్చు. రెండు పశువులకు రూ. 35 నుంచి 50 వేల వరకు సబ్సిడీ కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

గ్రామంలో ఉంటూ సాయిల్ ఇన్ఫర్మేషన్ ల్యాబ్ తెరవచ్చు. నేల, మట్టికి సంబంధించిన సమాచారాన్ని రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. నేల సారవంతంగానే ఉందా? ఎలాంటి పోషకాలు ఉన్నాయి? ఏవి కావాలి? ఎలాంటి పంటలు వేస్తే బాగుటుందని సలహాలు ఇవ్వాలి. సమాచారం కోసం ల్యాబ్‌ను తెరవవచ్చు. సాయిల్ ల్యాబ్‌కు ప్రభుత్వం నుంచి సాయం కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఉండే పశువుల సంఖ్య దాదాపు 53 కోట్లు. మేకలు, పశువులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పాలు, మాంస ఉత్పత్తిని పెంచడానికి మేత చాలా ముఖ్యం. అందుకే పోషక విలువలు కలిగిన తవుడు, దాణా వంటి వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గ్రామంలో నివసించే ప్రజలు పశుగ్రాస ఉత్పత్తి వ్యాపారాన్ని ప్రారంభించి.. మంచి ఆదాయం పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం) (ప్రతీకాత్మక చిత్రం)