చెన్నైలో ఓటు వేసిన సినీ ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: రెండవ విడత పోలింగ్‌లో చెన్నైలోని సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయానే్న ఓటు వేసేందుకు ప్రజలు, సినీ సెలబ్రిటీలు తరలివచ్చారు. సూర్య-జ్యోతిక దంపతులు, కార్తీ, విజయ్, కమల్‌హాసన్, కుమార్తె శృతిహాసన్, ఖుష్బూ క్యూలో నిలబడి ఓటు వేశారు. ఇక బెంగళూరు సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో ప్రకాష్‌రాజ్‌ ఓటేశారు. సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు అజిత్‌, ఆయన భార్య షాలిని, మరో సినీ నటుడు విజయ్‌ కూడా ఓటు వేశారు.

న్యూఢిల్లీ, మే 24: బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు 351 సీట్లు సంపాదించిపెట్టిన నరేంద్రమోదీ ఈనెల 29 లేదా 30వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. మొదట 29వ తేదీ ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న మోదీ మరుసటి రోజు జరిపే అవకాశాలున్నాయని అంటున్నారు.

న్యూఢిల్లీ, మే 24: ప్రధాన మంత్రి నరేంద్ర నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాజీనామా చేసింది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సౌత్ బ్లాక్‌లో చివరి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

న్యూఢిల్లీ, మే 24: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కకావికలమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల వ్యూహాలను ఛేదించుకుని ముందు నిలబడడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఫలితంగా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నివ్వెరపోయింది.

తిరువనంతపురం, మే 24: లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగితే.. కేరళలో మాత్రం అక్కడి ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చారు. లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని యూడీఎఫ్ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ సాధించింది.

లక్నో, మే 24: యూపీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల ఫిరాయింపుదారులకు ఆశనిపాతం ఎదురైంది. అయితే, కేవలం ఇద్దరు ఫిరాయింపుదారులు మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వారిలో ప్రవీణ్ నిషాద్ (బీజేపీ), కున్వర్ దనిష్ అలీ (బీఎస్పీ) ఉన్నారు.