అమెరికా, బ్రిటన్‌ తోడు దొంగలు | Prajasakti::Telugu Daily

- అసాంజె అరెస్టుపై రోజర్‌ వాటర్స్‌

                       లండన్‌ : వికీలీక్స్‌ వ్యవస్ధాపకుడు జూలియన్‌ అసాంజెను లండన్‌లోని ఈక్వెడార్‌ దౌత్య కార్యాలయం నుండి బయటకు పంపించడం విచారకరమని ప్రముఖ సంగీత విద్వాంసుడు రోజర్‌ వాటర్స్‌ విమర్శించారు. అసాంజె అరెస్టుపై ఆయన తన మనోభావాలను రాయిటర్స్‌ పత్రికతో పంచుకున్నారు. అమెరికా, బ్రిటన్‌ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా మేధావుల దృష్టిలో అసాంజె ఒక ముల్లు లాంటి వాడు. అసాంజెను బంధించేందుకు అమెరికా ఎన్ని కుతంత్రాలు పన్నిందీ ఆయన సోదాహరణంగా వివరించారు. తరచి చూస్తే అమెరికా సామ్రాజ్యానికి బ్రిటన్‌ ఒక ఉప గ్రహం మాదిరిగా వ్యవహరిస్తున్నదన్నారు. ఇది ఒక ఆంగ్లేయుడిగా తనకు అవమాన కరంగా ఉందన్నారు. ఈక్వెడార్‌ ఏడేళ్ళ క్రితం అసాంజెకు ఇచ్చిన రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించుకోవడంతో ఆయనను బ్రిటిష్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM