న్యూఢిల్లీ : డీజెల్ కార్లను కొనసాగిస్తాం

కస్టమర్లకు అందుబాటు ధరలో ఉండే విధంగానే డీజెల్‌ కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తామని మారుతి సుజుకి మంగళవారం నాడు స్పష్టం చేసింది. డిజెల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేసే ప్రసక్తి లేదని తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలను పాటించాల్సి రావడం వల్ల కార్ల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మారుతి వివిధ రకాల డిజెల్‌ పవర్‌ట్రెయిన్‌ కార్లను ఉత్పత్తి చేస్తోంది. వాటిలో ఎస్‌ -క్రాస్‌, సియాజ్‌, విటారా బ్రెజ్జా, డిజైర్‌, బలెనో, స్విఫ్ట్‌లున్నాయి. అయితే పెద్ద కార్ల ఉత్పత్తిని యధావిధిగా కొనసాగిస్తుంది. పోర్టుపోలియో నుంచి చిన్న కార్లను పూర్తిగా ఎత్తేయాలని చూస్తోంది. డిజెల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలనే నిర్ణయించారా అని ఎంఎస్‌ఐ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవను ప్రశ్నించగా.. కస్టమర్లకు ఖరీదైన డిజెల్‌ కార్లుకాకుండా అందుబాటు ధరల్లో ఉండే కార్లను యధావిధిగా కొనాసాగిస్తామని ఆయన అన్నారు. బీఎస్‌ – ప్రమాణాలు గల చిన్న డిజెల్‌ కార్లు ఖరీదైన వ్యవహారంగా మారనున్నాయి. కాబట్టి ఎంట్రీలెవెల్‌ కస్టమర్లకు ఇవి అందుబాటులో ఉండవని ఆయన అన్నారు. ఖరీదు ఎక్కువగా ఉంటే చిన్న కార్లను ఎవరూ కొంటారని ఆయన ప్రశ్నించారు. ధరలు పెరిగే కొద్ది ఏ కంపెనీ చిన్న కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపదు.. అందులోనూ డిజెల్‌ కార్లను అని ఆయన వివరించారు. చిన్న డిజెల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే మార్కెట్‌లో వాటా తగ్గదా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ ఉండదన్నారు. ప్రస్తుతం దేశీయ ప్యాసింజర్‌ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి 51 శాతం వాటా ఆక్రమించింది. చిన్న కార్ల మార్కెట్‌ ఇక్కడి నుంచి పెట్రోల్‌ లేదా సీఎన్‌జీకి మారిపోతాయని అన్నారు. మార్కెట్లో చిన్న డిజెల్‌ కార్లను ఎవరూ ఉత్పత్తి చేయరని.. మారుతినేకాకుండా ఏ ఆటోమొబైల్‌కంపెనీ చిన్న కార్ల జోలికిపోదని భార్గవ వివరించారు. చిన్న కార్లకు కూడా బీఎస్‌-6 ప్రమాణాలకు మారితే ప్రతి ఒక్క కంపెనీకి పెద్ద కార్ల ఉత్పత్తికి అయ్యే వ్యయం చిన్న కార్లకు అవుతుంద న్నారు. మార్కెట్లో దాని ప్రభావం అన్నీ కంపెనీలకు ఒకే మాదిరిగా ఉంటుందన్నారు. బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన చిన్న కారు డీజెల్‌కారును అమ్మకానికి పెడితే మార్కెట్లో అమ్ముకోవడం చాలా కష్టం .. ఎవరూ కొనుగోలు చేయడా నికి ముందుకురారని ఆయన స్పష్టం చేశారు. దీంతో కంపె నీలు పెట్రోల్‌ లేదా సీఎన్‌జీ లేదా ఇతర టెక్నాలజీకి మారు తాయని భార్గవ అన్నారు. మారుతి విషయానికి వస్తే ప్రసు తం 1.5 లీటర్‌ డిజెల్‌ ఇంజిన్‌ మిడ్‌సైజ్‌ సెడాన్‌ సియాజ్‌ను విక్రయిస్తోంది. డిజెల్‌ కార్లకు బీఎస్‌ 6 ప్రమాణాలను పాటిస్తే కార్ల ధరలు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ఆటోనిపుణులు అభిప్రాయపడుతున్నారు.