అనాథ పిల్లలను అలరించిన ఆరెంజ్‌ ఆర్మీ

సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌ క్రికెట్ జట్టు మంగళవారం మాసబ్‌ట్యాంక్ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌లో సందడి చేసింది. సన్ టీవి నెట్ వర్క్ , ఖుషీ టీవి సంయుక్త ఆధ్వర్యంలో.. అమన్వేదిక స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఓ వినూత్న కార్యక్రమానికి సన్‌రైజర్స్‌ టీం హాజరయ్యారు. ఆ సంస్థకు చెందిన అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడి చిన్నారులతో కాసేపు ఆడి పాడారు, క్రికెట్ ఆడించి అలరించారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ వార్నర్ , సైమన్ లు తమ కుటుంబ సభ్యులతో హాజరు కాగా..  కేన్ విలియ‌మ్స‌న్‌, అభిషేక్ శర్మ, విజయ్‌శంకర్, శ్రీ వత్స గోస్వామి, రషీద్‌ఖాన్, మహ్మద్‌నబీ, బెయిర్‌స్టో, బిల్లీ స్టాన్‌లేక్, నయీం, థియో తదితరులు అనాథ పిల్లలను అలరించారు.