Log in

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చారిత్రాత్మక సినిమా సైరా. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాలో చిరుకి జంటగా న‌య‌న‌తార నటిస్తుండగా మరో ముఖ్య‌మైన పాత్ర‌లో త‌మ‌న్నా నటిస్తోంది. ఇక మరిన్ని ముఖ్యమైన పాత్రల్లో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి, బాలీవుడ్ నుండి అమితాబ్ లాంటి ప‌లువురు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ కేరళలో జరుగుతోందట. చిరంజీవి మరి కొంత మంది మీద కేరళలోని దట్టమైన అడవుల్లో, భారీ పోరాట సీన్స్ ని చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది. 10 రోజుల పాటు అక్కడే ఉండనున్న సినిమా యూనిట్ మరిన్ని ఫైట్ సీన్స్ తెరకేక్కిస్తారు. ఈ షెడ్యూల్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ఉండనుంది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్ట్ పూర్తవునంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని ఇటీవల చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.