ఎట్టకేలకు గెలుపు...సన్ రైజర్స్‌కు ఊపు

*ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా* సూరత్ కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం:17మంది మృతి *ఏపీలో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ..23 స్థానాలకే టీడీపీ పరిమితం *ఈనెల 30న విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం *శనివారం వైసీపీ ఎల్పీ సమావేశం *16వ లోక్ సభను రద్దుచేస్తూ తీర్మానం చేసిన కేంద్ర కేబినెట్ *శనివారం కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం *ఈశాన్య భారతదేశంలో 25 ఎంపీ స్థానాలకు గాను 18 సీట్లు సాధించిన బీజేపీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 133 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హైదరాబాద్ కు వార్నర్ కళ్ళు చెదిరే ఆరంభాన్ని అందించాడు. కేవలం 24 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్ భారీ షాట్ ఆడబోయి జట్టు స్కోరు 66 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. కేవలం 6 ఓవర్లోనే 68 పరుగులు రావడంతో సన్ రైజర్స్ విజయం దాదాపు ఖరారయింది. ఈ దశలో విలియమ్సన్(3), విజయ్ శంకర్(7), దీపక్ హుడా(13) వెంట వెంటనే ఔటైనా బరిస్టా 61(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. యూసుఫ్ పఠాన్(0) నాటౌట్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 2, చాహర్, కరన్ శర్మ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. డుప్లెసిస్, వాట్సన్‌లు కలిసి తొలి వికెట్‌కి 79 పరుగులు జోడించారు. అయితే షాబాజ్ నదీమ్ వేసిన 10వ ఓవర్‌లో రైజర్స్‌కు బ్రేక్ లభించింది. ఈ ఓవర్ ఐదో బంతికి వాట్సన్(31) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఆ తర్వాత విజయ్ శంకర్ వేసిన 11వ ఓవర్ రెండో బంతికి డుప్లెసిస్(45) బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులో ఉన్న రైనాతో రాయుడు జత కలిశాడు. ఒకే ఓవర్ లో రషీద్ ఖాన్ రైనా(13), కేదార్ జాదవ్(0) వికెట్స్ తీశాడు. ఆ తరువాత ఖలీల్ అహ్మద్ కూడా బిల్లింగ్స్(0)ని ఔట్ చేయడంతో చెన్నై స్కోరు మందగించింది. చివర్లో రాయుడు(25) ,జడేజా(10) దూకుడుగా ఆడటంతో చెన్నై గౌరవ ప్రదమైన స్కోరుకు చేరింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, నదీమ్, విజయ్ శంకర్, ఖలీల్ అహ్మద్ చెరో ఒక వికెట్ తీశారు.